కీర్తనలు త్యాగరాజు మా రామచంద్రునికి జయమంగళం
కేదారగౌల - ఆది
మా రామచంద్రునికి జయమంగళం ॥మా॥
ఘోరభవవరనిధి తారకునికి మంగళం ॥మా॥
మారునిగన్న రాజ కు - మారునికి మంగళం
మారులేని హరికి ము - మ్మారు జయమంగళం ॥మా॥
బాహులే యాప్తునికి సు - బాహువైరికి మంగళం
బాహుజాశూరుని కాజాను - బాహునికి మంగళం ॥మా॥
బృందావనస్థిరమౌని - బృందావనునికి మంగళం
బృందాలోలునికి పాలిత - బృందారకునికి మంగళం ॥మా॥
రాజవేషునికి రాజ - రాజార్చితునికి మంగళం
రాజధరుడగు త్యాగ - రాజ నుతునికి మంగళం ॥మా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - maa raamachaMdruniki jayamaMgaLaM ( telugu andhra )