కీర్తనలు త్యాగరాజు మాటి మాటికి దెల్పవలెనా ముని మానసార్చిత చరణ
మోహన - చాపు
పల్లవి:
మాటి మాటికిఁ దెల్పవలెనా? ముని
మానసార్చిత చరణా! రామయ్య నీతో! ॥మాటి॥
అను పల్లవి:
సూటికొక్క టేమాట జాలదా?
నాటి మొదలుకొని సాటిలేని నీతో ॥మాటి॥
చరణము(లు):
పంకజ సదనా సరస వినోదా
సంకటముల వేగమె దీర్పదారా?
శంకరప్రియ సర్వాంతర్యామివి గాదా?
యింక నా మది నీకు తెలియగ లేదా? ॥మాటి॥
కరుణాసాగర పరిపూర్ణ! నీకు
సరివేల్పులు లేరనుచు నీవరకు
మొఱఁ బెట్టిన నాపై యేల పరాకు
పరులు జూతురు భాండమున కొక్క మెతుకు ॥మాటి॥
శృంగార శేఖర! సురవైరి రాజ
భంగ! సుజన హృత్కుమద రాజ
మంగళ కర రూప! జిత రతి రాజ
గంగా జనక! పాలిత త్యాగరాజ ॥మాటి॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - maaTi maaTiki delpavalenaa muni maanasaarchita charaNa ( telugu andhra )