కీర్తనలు త్యాగరాజు మానములేదా తనవాఁడని యభి
అమీర్‌ కల్యాణి - దేశాది
పల్లవి:
మానములేదా తనవాఁడని యభి మా..
అను పల్లవి:
కానమురా నీవలె నిర్మోహిని
గానరుచి తెలియు కుశలవజనక మా..
చరణము(లు):
నీ సముఖాన రవి తనయుఁడు నిన్ను
బాసలు బల్కఁగ రోసముతో సిం
హాసనాధిపతిఁ జేసిన నీకు
దాసుఁడైన త్యాగరాజ కరార్చిత మా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - maanamuleedaa tanavaa.rDani yabhi ( telugu andhra )