కీర్తనలు త్యాగరాజు మామవ సతతం, రఘునాథ!
జగన్మోహిని - ఆది
పల్లవి:
మామవ సతతం, రఘునాథ! ॥మా॥
అను పల్లవి:
శ్రీద! దినాన్వయ సాగరచంద్రా!
శ్రితజన శుభఫలద! సుగుణసాంద్ర! ॥మా॥
చరణము(లు):
భక్తి రహిత శాస్త్రవిదతిదూర!
పంకజదళనయన! నృపకుమార! ॥మా॥
శక్తితనయ హృదాలయ! రఘువీర!
శాంత! నిర్వికార! ॥మా॥
యుక్తవచన! కనకాచలధీర!
యురగశయన! మునిజన పరివార!
త్యక్తకామమోహమదగంభీర!
త్యాగరాజరిపు జలద సమీర! ॥మా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - maamava satataM, raghunaatha! ( telugu andhra )