కీర్తనలు త్యాగరాజు ముద్దుమోము యేలాగు చెలంగెనో? మునులెట్లు గని మోహించిరో?
సూర్యకాంతము - ఆది
పల్లవి:
ముద్దుమోము యేలాగు చెలంగెనో?
మునులెట్లు గని మోహించిరో? ॥ముద్దు॥
అను పల్లవి:
కద్దనుచును చిరకాలము హృదయము
కరఁగి కరఁగి నిల్చు వారికెదుట రాముని ॥ముద్దు॥
చరణము(లు):
మనసు నిర్మలమగు భూసుర కృతమౌ
మంచి పూజా ఫలమౌ, తొలుతటి తపమౌ
ఘననిభ దేహుని జనన స్వభావమౌ
ధనపతి సఖుఁడైన త్యాగరాజార్చితుని ॥ముద్దు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - muddumoomu yeelaagu chelaMgenoo? munuleTlu gani moohiMchiroo? ( telugu andhra )