కీర్తనలు త్యాగరాజు మేను జూచి మోస బోవకే, మనసా లోని జాడ లీలాగు కదా
సరసాంగి - దేశాది
పల్లవి:
మేను జూచి మోస బోవకే, మనసా!
లోని జాడ లీలాగు కదా? ॥మేను॥
అను పల్లవి:
హీనమైన మలమూత్ర రక్తముల
కిల నెంచు మాయామయ మైన చాన ॥మేను॥
చరణము(లు):
కనులనెడి యంప కోలచేత గుచ్చి
చనులనెడి గిరుల శిరమునుంచి
పనులుచేతురట త్యాగరాజనుతుని బా
గ నీవు భజన జేసుకొమ్మి స్త్రీల ॥మేను॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - meenu juuchi moosa boovakee, manasaa looni jaaDa liilaagu kadaa ( telugu andhra )