కీర్తనలు త్యాగరాజు మేలుకోవయ్య మమ్మేలుకోవయ్య రామ
బౌళి - జంప
పల్లవి:
మేలుకోవయ్య మమ్మేలుకోవయ్య రామ ॥మే॥
అను పల్లవి:
మేలైన సీతాసమేత నా భాగ్యమా ॥మే॥
చరణము(లు):
నారదాదులు నిన్నుఁ గోరి నీ మహిమల న
వారిగాఁ బాడుచున్నారిపుడు తెల్ల
వారగా వచ్చినది శ్రీరామ నవనీత
క్షీరములు బాగుగా నారగింపను వేగ ॥మే॥
ఫణిశయన యనిమిష రమణు లూడిగముసేయ
అణుకువగ నిండారు ప్రణుతి జేసెదరును
మణిమయాభరణులౌ యణిమాదు లిడుదీప
మణులు తెలుపాయెను తరణివంశవరతిలక ॥మే॥
రాజరాజేశ్వర భరాజముఖ సాకేత
రాజ సద్గుణ త్యాగరాజనుతచరణ
రాజన్య విబుధగణరాజాదులెల్ల నిను
పూజింపఁగాచినారీజగము పాలింప ॥మే॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - meelukoovayya mammeelukoovayya raama ( telugu andhra )