కీర్తనలు త్యాగరాజు మోక్షముగలదా భువిలో జీవ - న్ముక్తులు గానివారలకు
సారమతి - దేశాది
పల్లవి:
మోక్షముగలదా భువిలో జీవ - న్ముక్తులు గానివారలకు ॥మో॥
అను పల్లవి:
సాక్షాత్కార నీసద్భక్తి - సంగీతజ్ఞానవిహీనులకు ॥మో॥
చరణము(లు):
ప్రాణానల సంయోగము వల్ల
ప్రణవనాదము సప్తస్వరములై బరగ
వీణావాదనలోలుఁడౌ శివమనో
విధ మెఱుఁగరు త్యాగరాజ వినుత ॥మో॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - mooxamugaladaa bhuviloo jiiva - nmuktulu gaanivaaralaku ( telugu andhra )