కీర్తనలు త్యాగరాజు మోసబోకు వినవే సత్సహ - వాసము విడువకే
గౌళిపంతు - ఆది
పల్లవి:
మోసబోకు వినవే సత్సహ - వాసము విడువకే ॥మో॥
అను పల్లవి:
దాస జనార్తి హరుని, శ్రీరాముని,
వాసవ హృదయ నివాసుని, తెలియక ॥మో॥
చరణము(లు):
అల్పాశ్రయమున గల్గు వెసనములు
కల్పాంతరమైన బోదు; శేష
తల్ప శయనుని నెఱనమ్మిన సం
కల్ప మెల్ల నీడేరును, మనసా! ॥మో॥
ధన తరుణుల కాశించునదెల్ల
వెనక తనువు కలసటే గాని
మనసు చేత సేవ్యుని దలచిన సు
మనసత్వము నొసగునే, మనసా! ॥మో॥
గౌరవ హీన ధనికులఁ గాచుటయు
నేరములకెడ మౌను గాని,
గౌరవించు త్యాగరాజ హృదయా
గారుని, లోకాధారునిఁ, దలచక ॥మో॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - moosabooku vinavee satsaha - vaasamu viDuvakee ( telugu andhra )