కీర్తనలు త్యాగరాజు యజ్ఞాదులు సుఖమను వారికి సమ మజ్ఞానులు గలరా
జయమనోహరి - ఆది
పల్లవి:
యజ్ఞాదులు సుఖమను వారికి సమ
మజ్ఞానులు గలరా? ఓమనసా ॥యజ్ఞాదులు॥
అను పల్లవి:
సుజ్ఞాన దరిద్ర పరంపరల
సురచిత్తులు జీవాత్మ హింసగల ॥యజ్ఞాదులు॥
చరణము(లు):
బహు జన్మంబుల వాసన యుతులై
అహి విష సమ విషయాకృష్టులై
బహిరాననులై త్యాగరాజు
భజియించు శ్రీరామునికిఁ దెలియక ॥యజ్ఞాదులు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - yaGYaadulu sukhamanu vaariki sama maGYaanulu galaraa ( telugu andhra )