కీర్తనలు త్యాగరాజు యోచనా కమల - లోచన ననుఁబ్రోవ
దర్బారు - ఆది
పల్లవి:
యోచనా కమల - లోచన ననుఁబ్రోవ ॥యో॥
అను పల్లవి:
సూచనతెలియక నొరుల - యాచనఁజేతుఁననుచు నీకు
తోచిన ద్యుతి విజితాయుత వి - మోచన నన్నుఁ బ్రోవనింక ॥యో॥
చరణము(లు):
కేచన నిజభక్త నిచయ పావని - మోచనఁగల బిరుదెల్లఁగొని న
న్నేచనాకృతవిపినచరావరాభి -షేచనా త్యాగరాజ పూజిత ॥యో॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - yoochanaa kamala - loochana nanu.rbroova ( telugu andhra )