కీర్తనలు త్యాగరాజు రక్షబెట్టరే దొరకు
భైరవి - ఆది
పల్లవి:
రక్షబెట్టరే దొరకు రక్ష..
అను పల్లవి:
వక్షస్థలమున వెలయు లక్ష్మీరమణునికి జయ రక్ష..
చరణము(లు):
సీతాకరమునుబట్టి చెలగిన దొరకు
వాతాత్మజునికి చేయి వశమైన దొరకు, పురు
హూతాదుల రక్షింప బాహుదుడైన దొరకు, సం
గీతప్రియ త్యాగరాజ గేయుడైన దొరకైశ్వర్య రక్ష..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raxabeTTaree doraku ( telugu andhra )