కీర్తనలు త్యాగరాజు రఘు నందన! రాజ మోహన! రమియింపవే నా మనసున
శుద్ధదేశి - దేశాది
పల్లవి:
రఘు నందన! రాజ మోహన!
రమియింపవే నా మనసున ॥రఘు॥
అను పల్లవి:
నగజానిలజ నారదాది హృ
న్నాళినివాసుఁడైన గాని శ్రీ ॥రఘు॥
చరణము(లు):
చిత్తమందు నిన్నుంచి ప్రేమతో - జింతించు సద్భక్తుల
నుత్తమోత్తములంచు నా మది నుంచి పూజించ లేదా?
తత్తరంబు దీర్ప గారణంబు నీవే
తాళ జాల నిక, త్యాగరాజనుత! ॥రఘు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raghu naMdana! raaja moohana! ramiyiMpavee naa manasuna ( telugu andhra )