కీర్తనలు త్యాగరాజు రఘువర! నన్ను మరవ తగునా?
పంతువరాళి - ఆది
పల్లవి:
రఘువర! నన్ను మరవ తగునా? ॥రఘువర॥
అను పల్లవి:
నగధర! భక్తనాఘ! నివారణ ॥రఘువర॥
చరణము(లు):
తల్లి తండ్రు లన్న తమ్ములు యున్న
పొలతికి యొక్కఁడు పురుషుఁడు యౌనా? ॥రఘువర॥
పరదైవములు బాగు సొమ్ములు
సురనుత! మంగళ సూత్రములౌనా ॥రఘువర॥
జేసిన పుణ్యచయము బ్రహ్మణ్య
ఆశనొసంగితి అనుపమ లావణ్య ॥రఘువర॥
మనసున నీకే మరులు కొన్నాను స
జ్జనహిత త్యాగరాజనుత శుభాకర ॥రఘువర॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raghuvara! nannu marava tagunaa? ( telugu andhra )