కీర్తనలు త్యాగరాజు రాకా శశివదన ఇంక పరాకా
టక్కా - ఆది
పల్లవి:
రాకా శశివదన ఇంక పరాకా రా..
అను పల్లవి:
నీకా గుణముకారా దవనీ
కాంత కరుణాస్వాంత రా..
చరణము(లు):
నమ్మియున్న నిజదాసులకు
నమ్మికల నొసఁగి మఱతురా
తమ్మికనుల నొకసారి నను
దయఁజూడరాదా మరియాదా రా..
పారి పారి నిన్ననుదినము
కోరికోరినవారిని యీ
దారిఁ బ్రోచితివా మాయా
ధారి రారా ఏలుకోరా రా..
నీవే దెలిసికొందు వనుచును
భావించుచును నేను నీ పద
సేవఁ జేసితి మహాను
భావ త్యాగరాజునిపై రా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raakaa shashivadana iMka paraakaa ( telugu andhra )