కీర్తనలు త్యాగరాజు రాగ రత్న మాలికచే రంజిల్లునట, హరి
రీతిగౌళ - రూపకం
పల్లవి:
రాగ రత్న మాలికచే రంజిల్లునట, హరి శత ॥రాగ॥
అను పల్లవి:
బాగ సేవించి సకల భాగ్య మొందుదాము రారే ॥రాగ॥
చరణము(లు):
నైగమ షట్ఛాస్త్ర పురా ణాగమార్థ సహితమట
యోగి వరులు యానందము నొందెడు సన్మార్గమట
భాగవతోత్తములు గూడి బాడే కీర్తనములట
త్యాగరాజు కడతేర తారకమని చేసిన శత ॥రాగ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raaga ratna maalikachee raMjillunaTa, hari ( telugu andhra )