కీర్తనలు త్యాగరాజు రామ! నీ సమాన మెవరు, రఘువంశోద్ధారక
ఖరహరప్రియ - రూపకం
పల్లవి:
రామ! నీ సమాన మెవరు, రఘువంశోద్ధారక ॥రామ॥
అను పల్లవి:
భామా మరువంపు మొలక! భక్తియను పంజరపు చిలుక ॥రామ॥
చరణము(లు):
పలుకు పలుకులకు తేనె యొలుక మాటలాడు సోద
రులుఁగల హరి త్యాగరాజ కులవిభూష! మృదు - సుభాష! ॥రామ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raama! nii samaana mevaru, raghuvaMshooddhaaraka ( telugu andhra )