కీర్తనలు త్యాగరాజు రామనామం భజరే మానస
మధ్యమావతి - ఆది
పల్లవి:
రామనామం భజరే మానస ॥రామ॥
చరణము(లు):
దొంగరీతి తిరుగంగనేల శ్రీ
రంగని పదముల కౌగిలించుకొని ॥రామ॥
ఎవఁడైన హరియెక్కఁడనుచు మది
చక్కతనముగని సొక్కి సంతతము ॥రామ॥
ఎందుబోక రాకేందుముఖుని తన
యందుజూచి ఫలమందుగోరు శ్రీ ॥రామ॥
దేహమెత్తి సందేహపడక వై
దేహి భాగ్యమా దేహి దేహియని ॥రామ॥
సాధు సజ్జనులు బోధచేత భవ
బాధ మానవలె సాధకంబుతో ॥రామ॥
దీనుఁడైన సంధానుఁడైన విను
మనురాగమున మేనొసంగి శ్రీ ॥రామ॥
రాగరహిత జన భాగధేయుని వి
నా గతి యెవ్వరే త్యాగ రాజనుత ॥రామ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raamanaamaM bhajaree maanasa ( telugu andhra )