కీర్తనలు త్యాగరాజు రామా నీ యెడ ప్రేమరహితులకు
దిలీపక - దేశాది
పల్లవి:
రామా నీ యెడ ప్రేమరహితులకు
నామరుచి తెలుసునా ఓ సీతా రా..
అను పల్లవి:
కామినీవేసధారికి సాధ్వీ నడత
లేమైనఁ దెలుసునా రీతి సీతా రా..
చరణము(లు):
తన సౌఖ్యము తా నెఱుఁగక యొరులకు
తగు బోధన సుఖమా
ఘనమగు పులి గోరూపమైతే త్యా
గరాజనుత శిశువుపాలు కల్గునా రా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raamaa nii yeDa preemarahitulaku ( telugu andhra )