కీర్తనలు త్యాగరాజు రార, సీతారమణి మనోహర!
హిందోళవసంతము - రూపకము
పల్లవి:
రార, సీతారమణి మనోహర! ॥రార॥
అను పల్లవి:
నీరజ నయన ఒక ముద్దీర ధీర ముంగల ॥రార॥
చరణము(లు):
బంగారు వల్వల నే బాగుగఁ గట్టెద మఱి
శృంగారించి సేవఁజేసి కౌగిటఁ జేర్చెద ॥రార॥
సారె నుదుటకు గస్తూరితిలకముఁ బెట్టెద
సారమైన ముక్తాహారములను దిద్దెద ॥రార॥
యోగము నీపై యనురాగముఁ బాడెద వే
రే గతియెవరు? శ్రీత్యాగరాజ వినుత! ॥రార॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raara, siitaaramaNi manoohara! ( telugu andhra )