కీర్తనలు త్యాగరాజు లావణ్యరామ కనలార జూడరే
రుద్రప్రియ - రూపకం
పల్లవి:
లావణ్యరామ కనలార జూడరే అతి ॥లావణ్య॥
అను పల్లవి:
శ్రీ వనితా చిత్త కుముద శీతకర! శతానన్యజ! ॥లావణ్య॥
చరణము(లు):
నీ మనసు నీ సొగసు నీ దినుసు వేరే
తామస మత దైవమేల? త్యాగరాజనుత దివ్య ॥లావణ్య॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - laavaNyaraama kanalaara juuDaree ( telugu andhra )