కీర్తనలు త్యాగరాజు లేకనా నిన్ను జుట్టుకొన్నారు?
అసావేరి - ఆది
పల్లవి:
లేకనా నిన్ను జుట్టుకొన్నారు?
ఏకహృదయులై నిత్యానందము ॥లే॥
అను పల్లవి:
శ్రీకర! కరుణాసాగర! నిరుపమ
చిన్మయా! శ్రిత చింతామణి! నీయెడ ॥లే॥
చరణము(లు):
సౌందర్యములలో సుఖము సీతమ్మకు
సౌమిత్రికిఁ గనుల జాడల సుఖము ॥లే॥
సుందర ముఖమున సుఖము భరతునికి
సుజ్ఞాన రూపమున సుఖము రిపుఘ్నునికి ॥లే॥
చరణ యుగమునందు సుఖమాంజనేయునికి
వరగుణ త్యాగరాజ వరదా! నందము ॥లే॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - leekanaa ninnu juTTukonnaaru? ( telugu andhra )