కీర్తనలు త్యాగరాజు వందనము రఘునందన సేతు - బంధన భక్త చందన రామ
శహన - ఆది
పల్లవి:
వందనము రఘునందనా సేతు - బంధనా భక్త చందనా రామ ॥వం॥
శ్రీదమా నాతో వాదమా నే - భేదమా ఇది మోదమా రామ ॥వం॥
శ్రీరమా హృచ్చారమా బ్రోవ - భారమా రాయబారమా రామ ॥వం॥
వింటిని నమ్ము కొంటిని శర - ణంటిని రమ్మంటిని రామ ॥వం॥
ఓడను భక్తి వీడను ఒరుల - వేడను నీవాఁడను రామ ॥వం॥
కమ్మని విడె మిమ్మని వరము - కొమ్మని పలుకరమ్మని రామ ॥వం॥
న్యాయమా నీకాదాయమా ఇంత - హేయమా మునిగేయమా రామ ॥వం॥
చూడుమీ కాపాడుమీ మమ్ము - పోడిమిగాఁ గూడుమీ రామ ॥వం॥
క్షేమము దివ్యధామము నిత్య - నేమము రామనామము రామ ॥వం॥
వేగరా కరుణాసాగర శ్రీ - త్యాగరాజుని హృదయాకర రామ ॥వం॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - vaMdanamu raghunaMdana seetu - baMdhana bhakta chaMdana raama ( telugu andhra )