కీర్తనలు త్యాగరాజు వరనారద నారాయణ
విజయశ్రీ - ఆది
పల్లవి:
వరనారద నారాయణ
స్మరణానందానుభవముగల వ..
అను పల్లవి:
శరదిందు నిభాపఘనానఘ
సారముగాను బ్రోవు మిఁక వ..
చరణము(లు):
సకలలోకములకు సద్గురువనుచు
సదా నే నతఁడనుచు హరియు
ప్రకటంబుగఁ గీర్తి నొసంగెనే
భావుక త్యాగరాజనుత వ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - varanaarada naaraayaNa ( telugu andhra )