కీర్తనలు త్యాగరాజు వరరాగలయజ్ఞులు దామనుచు వదరెరయా
చెంచుకాంభోజి - దేశాది
పల్లవి:
వరరాగలయజ్ఞులు దామనుచు వదరెరయా ॥వర॥
అను పల్లవి:
స్వర జాతి మూర్ఛన భేదములు
స్వాంతమందు దెలియక యుండిన ॥వర॥
చరణము(లు):
దేహోద్భవంబగు నాదములు
దివ్యమౌ ప్రణవాకార మను
దాహం బెఱుఁగని మానవులు
త్యాగరాజనుత యేచెదరు రామ ॥వర॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - vararaagalayaGYulu daamanuchu vadarerayaa ( telugu andhra )