కీర్తనలు త్యాగరాజు వరలీల గానలోల సురపాల సుగుణజాల
శంకరాభరణ - త్రిశ్రలఘు
పల్లవి:
వరలీల గానలోల సురపాల సుగుణజాల
భరిత నీలగళ హృదాలయ శృతిమూల సు
కరుణాలవాల పాలయాశు మాం వ..
చరణము(లు):
సురవందితాప్తబృంద
వరమందరధర సుందరకర కుం
దరద నేందుముఖ సనందననుత
నందనందనేందిరావరా వ..
(ముని)చింతనీయ స్వాంత నరకాంతక నిగ
మాంత చరణ సుకాంత కుశల
వాంతరహిత దాంతకుజ వ
సంత సంత తాంతక స్తుత వ..
వరపూష వంశభూష నతపోషణ
మృదుభాషణ రిపుభీషణ
నరవేష నగపేషణ
వరశేషభూష తోషితానఘ వ..
సుకవీశహృన్నివేశ జగదీ
శ కుభవపాశరహిత శ్రీశ
సురగణేశహిత జలేశశయన
కేశవా శమీశదుర్లభ వ..
రణధీర సర్వసార సుకుమార
బుధవిహార దనుజనీరధర
సమీకరణ కరుణారసపరిపూర్ణ
జారచోర పాహిమాం వ..
నరరక్షక నీరజాక్ష వరరాక్షస
మదశిక్షక సురయక్ష సన
క రుక్షపతి నుతాక్షహరణ
పక్షదక్షశిక్షకప్రియ వ..
రఘురాజ త్యాగరాజనుత
రాజదివసరాజనయన భో
జగదవనాజనక రాజ సుతా వి
రాజరాజ రాజపూజిత వ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - varaliila gaanaloola surapaala suguNajaala ( telugu andhra )