కీర్తనలు త్యాగరాజు వరశిఖివాహన! వారిజ లోచన
సుప్రదీపం - ఆది
పల్లవి:
వరశిఖివాహన! వారిజ లోచన! ॥వర॥
అను పల్లవి:
కురు శంతనుజిత కుసుమ శరాయుత
శరజభవాంబుద వాహనాది
సురనుత పాద సుగుణకుమార ॥వర॥
చరణము(లు):
తారక శూర పద్మాసుర తూల
దహన భూధర సుత నందన ధీర
శ్రీరఘువీర భాగినేయాప్త ఉ
దార ఘృణాకర త్యాగరాజనుత ॥వర॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - varashikhivaahana! vaarija loochana ( telugu andhra )