కీర్తనలు త్యాగరాజు విధి శక్రాదులకు దొరుకునా? ఇటువంటి సన్నిధి వేడుక జూతాము రారె
యమునాకల్యాణి - రూపకం
పల్లవి:
విధి శక్రాదులకు దొరుకునా? ఇటువంటి స
న్నిధి వేడుక జూతాము రారె ॥విధి॥
అను పల్లవి:
సుధీజనరక్షకి ధర్మాం - బుధిశాయి సేవ జూడ ॥విధి॥
చరణము(లు):
ఉడుపతి ముఖులెల్ల వరుసగా బిరుదులనుఁబట్టి
అడుగడుగు జయజయ యనగా యా వేల్పులవేల
పడుచులు నిజ నాట్యమాడగా సమయమున పసిడి
సుమవర్షము గురియగ వడివడిగ సమరకోటులు
తడతడ భూమిని దండములిడగా సం
తోషమునను కడకంటిని జూచు సొగసు ॥విధి॥
శ్రీరమణిజూచి పల్కగ నవరత్నాల హారపు
సురు లల్లాడగ ఆ మొలక నగవు
గౌరవము అంతటను మెరయగ నావేళ సనక
నారదాదులెల్లఁ బొగడగా కీరమునను బూని సరిగ
చీర కాంతి మెరయగా శృంగారి కొలువు యుండు శుక్ర
వారపు సొగ సెల్ల జూడ ॥విధి॥
తరుణారుణ వదన కమలిని అత్యంతమైన
కరుణారస పూర్ణ నేత్రిని శ్రీపంచనద
మెరయు కంకణయుతకర పర దేవిని సేవింప ॥విధి॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - vidhi shakraadulaku dorukunaa? iTuvaMTi sannidhi veeDuka juutaamu raare ( telugu andhra )