కీర్తనలు త్యాగరాజు విన నాసకొని యున్నానురా, విశ్వరూపుఏ
ప్రతాపవరాళి - ఆది
పల్లవి:
విన నాసకొని యున్నానురా, విశ్వరూపుఁడ నే ॥విన॥
అను పల్లవి:
మనసారగ వీనుల విందుగ మధురమైన పలుకుల ॥విన॥
చరణము(లు):
సీతా రమణితో వామన గుంట లాడి గెల్చుట
చేత నొకరి కొకరు జూచి యాభావ మెఱిఁగి సా
కేతాధిప! నిజమగు ప్రే మతోఁ బల్కుకొన్న ముచ్చట
వాతాత్మజ భరతులు విన్నటుల త్యాగరాజ సన్నుత! ॥విన॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - vina naasakoni yunnaanuraa, vishvaruupuee ( telugu andhra )