కీర్తనలు త్యాగరాజు వినుతాసుతవాహన శ్రీరమణ - మనసారఁగ సేవించెద రామ
జయంతసేన - ఆది
పల్లవి:
వినుతాసుతవాహన శ్రీరమణ - మనసారఁగ సేవించెద రామ ॥వి॥
అను పల్లవి:
నిను సారెకుఁ జూడని బ్రతుకేలే - మనుజుల నే చే జీవనమేలే ॥వి॥
చరణము(లు):
మతభేదమనే శకనాస్తిక స - మ్మతవాక్కులు బల్కుట సుఖమా
క్షితిలో సత్సంగతి సౌఖ్యము పా - లిత త్యాగరాజామరపాల ॥వి॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - vinutaasutavaahana shriiramaNa - manasaara.rga seeviMcheda raama ( telugu andhra )