కీర్తనలు త్యాగరాజు వేరెవ్వరేగతి, వేమారులకు, సీతాపతి
సురటి - దేశాది
పల్లవి:
వేరెవ్వరేగతి, వేమారులకు, సీతాపతి ॥వే॥
అను పల్లవి:
ఈరేడు లోకముల కా ధారుఁడగు నిన్ను వినా ॥వే॥
చరణము(లు):
బృందారకాది ముని బృంద శుక సనక స
నందన శ్రీనారదారవిందోద్భవ శ్రీ భవ పు
రందరులకు, త్యాగరాజునికి నిన్ను వినా ॥వే॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - veerevvareegati, veemaarulaku, siitaapati ( telugu andhra )