కీర్తనలు త్యాగరాజు శంభోమహాదేవ శంకర గిరిజారమణ
పంతువరాళి - చాపు
పల్లవి:
శంభోమహాదేవ శంకర గిరిజారమణ శం..
అను పల్లవి:
శంభో మహాదేవ శరణాగతజనరక్షక
అంభోరుహలోచన పదాంబుజ భక్తిం దేహి శం..
చరణము(లు):
పరమదయాకర మృగధరధర గంగాధర ధరణీ
ధరభూషణ త్యాగరాజవర హృదయనివేశ
సురబృంద కిరీటమణివర నీరాజితపద గో
పురవాస సుందరేశ గిరీశ పరాత్పర భవహర శం..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shaMbhoomahaadeeva shaMkara girijaaramaNa ( telugu andhra )