కీర్తనలు త్యాగరాజు శశి వదన, భక్త జనావన, శంకర, నే తాళ గలనా?
చంద్రజ్యోతి - ఆది
పల్లవి:
శశి వదన, భక్త జనావన, శంకర, నే తాళ గలనా? ॥శశి॥
అను పల్లవి:
పసితనమందే మునియాగమున నీ
బాహుపరాక్రమము నెఱుగనా రాకా ॥శశి॥
చరణము(లు):
దిన దిన మౌపాసన జప తప
ధ్యానమను యోగము వేళ మనసున బుట్టిన
ఘన డంభుని తోడను మారీచుఁడు
పని చెఱచిన యీ త్యాగరాజర్చిత ॥శశి॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shashi vadana, bhakta janaavana, shaMkara, nee taaLa galanaa? ( telugu andhra )