కీర్తనలు త్యాగరాజు శోభానే
పంతువరాళి - త్రిపుట
పల్లవి:
శోభానే ॥శోభానే॥
అను పల్లవి:
వదన ద్యుతిజిత సోమ వసుధ మానవ కామ
మదమానవ గణభీమ మాం పాహి శ్రీరామ ॥శోభానే॥
చరణము(లు):
జనక సుతా హృద్రమణ జమదగ్నిజ మదహరణ
ప్రణతాఘానల వరుణ పాహిమాం మునిశరణ ॥శోభానే॥
విగళిత మోహాపాశ విధు కోటి సంకాశ
భగవన్‌ సకలాధీశ పాహి పాప వినాశ ॥శోభానే॥
వర త్యాగరాజనుత వారిద సంభవ తాత
పరమ కల్యాణ యుత పాహి మాం శుభ చరిత్ర ॥శోభానే॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shoobhaanee ( telugu andhra )