కీర్తనలు త్యాగరాజు శోభానే
పంతువరాళి - త్రిపుట
పల్లవి:
శోభానే ॥శో॥
అను పల్లవి:
వదనద్యుతిజితసోమ - వసుధామానసకామ
మదమానవగణభీమ - మాం పాహి శ్రీరామ ॥శో॥
చరణము(లు):
జనకసుతా హృద్రమణ - జమదగ్నిజ మదహరణ
ప్రణతాఘానలవరున - పాహిమాం మునిశరణ ॥శో॥
విగళిత మోహపాశ - విధుకోటి సంకాశ
భగవన్‌ సకలాధీశ - పాహి పాపవినాశ ॥శో॥
వరత్యాగరాజనుత - వారిజసంభవతాత
పరమకల్యాణయుత - పాహి మాం శుభచరిత ॥శో॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shoobhaanee ( telugu andhra )