కీర్తనలు త్యాగరాజు శ్రీగణపతిని సేవించరారే శ్రితమానవులారా
సౌరాష్ట్ర - ఆది
పల్లవి:
శ్రీగణపతిని సేవించరారే శ్రితమానవులారా శ్రో..
అను పల్లవి:
వాగధిపతి సుపూజలఁ జేకొని
బాగ నటింపుచును వెడలిన శ్రీ..
చరనము(లు):
పనసనారికేళాది జంబూఫలము లారగించి
ఘనతరంబునను మహిపై పదములు
ఘల్లుఘల్లున నుంచి
అనయము హరి చరణయుగముల
హృదయాంబుజమున నుంచి
వినయమునను త్యాగరాజవినుతుని
వివిధగతుల ధళంగుమని వెడలిన శ్రీ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shriigaNapatini seeviMcharaaree shritamaanavulaaraa ( telugu andhra )