కీర్తనలు త్యాగరాజు శ్రీనారద! నాద సరసీరుహ భృంగ, శుభాంగ
కానడ - రూపకం
పల్లవి:
శ్రీనారద! నాద సరసీరుహ భృంగ, శుభాంగ ॥శ్రీ॥
అను పల్లవి:
దీనమానరక్షక! జగదీశ! భేష సంకాశ ॥శ్రీ॥
చరణము(లు):
వేద జనిత వర వీణా వాదన తత్త్వజ్ఞ!
ఖేదకర త్రితాప రహిత! ఖేచర వినుత!
యాదవ కులజాప్త! సదా మోద హృదయ మునివర్య!
శ్రీద త్యాగరాజ వినుత! శ్రీకర! మాం పాలయ ॥శ్రీ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shriinaarada! naada sarasiiruha bhR^iMga, shubhaaMga ( telugu andhra )