కీర్తనలు త్యాగరాజు శ్రీరఘుకులమందుఁ బుట్టి
హంసధ్వని - దేశాది
పల్లవి:
శ్రీరఘుకులమందుఁ బుట్టి
సీతను జేకొనిన రామచంద్ర ॥శ్రీ॥
అను పల్లవి:
ఆరామ మందు మునుల కోరిక
లీడేరసేయఁ బూనుకొన్న రామ ॥శ్రీ॥
చరణము(లు):
వరరత్న పీఠమందు మజ్జనము
పుడమి సురలచేతఁ గైకొన్న రామ
పరమభక్తులను బాలనము సేయు
సాకేతవాస త్యాగరాజనుత ॥శ్రీ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shriiraghukulamaMdu.r buTTi ( telugu andhra )