కీర్తనలు త్యాగరాజు శ్రీరామ రఘురామ శృంగార రామయని చింతించరాదె ఓ మనసా
యదుకులకాంభోజి - ఝంప
పల్లవి:
శ్రీరామ రఘురామ శృంగార రామయని
చింతించరాదె ఓ మనసా ॥శ్రీరామ॥
చరణము(లు):
తళుకు చెక్కుల ముద్దు బెట్టు కౌసల్య మును
తపమేమి జేసెనో తెలియ ॥శ్రీరామ॥
దశరథుఁడు శ్రీరామ రారయని పిల్వ మును
తపమేమి జేసెనో తెలియ ॥శ్రీరామ॥
తనితపర పరిచర్య సేయ సౌమిత్రి మును
తపమేమి జేసెనో తెలియ ॥శ్రీరామ॥
తనవెంట చనజూచి యుప్పొంగ కౌశికుఁడు
తపమేమి జేసెనో తెలియ ॥శ్రీరామ॥
తాపంబణగి రూపవతియౌట కహల్య
తపమేమి జేసెనో తెలియ ॥శ్రీరామ॥
ధర్మాత్ము చరణంబుసోక శివచాపంబు
తపమేమి జేసెనో తెలియ ॥శ్రీరామ॥
తన తనయ నొసగి కనులార గన జనకుండు
తపమేమి జేసెనో తెలియ ॥శ్రీరామ॥
దహరంబు కరగ కరమును బట్ట జానకి
తపమేమి జేసెనో తెలియ ॥శ్రీరామ॥
త్యాగరాజా ప్తయని పొగడ నారదమౌని
తపమేమి జేసెనో తెలియ ॥శ్రీరామ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shriiraama raghuraama shR^iMgaara raamayani chiMtiMcharaade oo manasaa ( telugu andhra )