కీర్తనలు త్యాగరాజు శ్రీరామదాస దాసోహం, నీరజ నేత్ర నీకేల సందేహం?
ధన్యాసి - చాపు
పల్లవి:
శ్రీరామదాస దాసోహం, నీరజ
నేత్ర నీకేల సందేహము? ॥శ్రీరామ॥
చరణము(లు):
గట్టు కానరాని గుంత రామ
పట్టుకొని దాత నీ పేరు తెప్పంట ॥శ్రీరామ॥
కామాదుల నక్కర బాధ తీర్ప
రామయ్య నీచేత చక్రము లేదా ॥శ్రీరామ॥
చలచిత్తమను నలలకు రామ
చెలగు నీ వామ హస్తము వైరియగును ॥శ్రీరామ॥
మదమత్సరములను గజములకు నీ
పద కమలాంకుశ రేఖ వజ్రము ॥శ్రీరామ॥
శోకాదులను పర్వతములకు
నీ కరాంకిత రేఖవజ్ర చయములు ॥శ్రీరామ॥
అహమను జడత్వ మణచి బ్రోవ
సహజమౌ నీ చేతి శరములు లేవా ॥శ్రీరామ॥
దుష్కర్మములను కొండలెగయసేయ
నిష్కల్మష పవనజుడుండు సదయ ॥శ్రీరామ॥
జనన మరణమను సుడిని నిల్ప
ఘనమైన నీ యాజ్ఞ గాదను వడిని ॥శ్రీరామ॥
జాతికొకరు కూడినారము ప్రీతి
చేత దెలుసుకొంటిమి నామసారము ॥శ్రీరామ॥
పన్నుగ భవ మతి ఘోరము రామ
నిన్ను వినా అన్యదైవములను కోరము ॥శ్రీరామ॥
వరగుణ రాజాధిరాజ రామ
పరమపావన పాలిత త్యాగరాజ ॥శ్రీరామ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shriiraamadaasa daasoohaM, niiraja neetra niikeela saMdeehaM? ( telugu andhra )