కీర్తనలు త్యాగరాజు సదా మదిన్‌ దలతు గదరా
గంభీరవాణి - దేశాది
పల్లవి:
సదా మదిన్‌ దలతు గదరా
ముదాస్పద నగజాధిపతే స..
అను పల్లవి:
సదా శివానంద స్వరూప
సదయమోదహృదయ పదసరోజములనే స..
చరణము(లు):
దిగంబరాంధక దైత్యహర
దిగీశ సన్నుత గంగాధర
మృగాంకశేఖర నటన చతుర
మనుపసమయమిదిరా త్యాగరాజ వినుత స..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - sadaa madin dalatu gadaraa ( telugu andhra )