కీర్తనలు త్యాగరాజు సరస సామ దాన భేద దండ చతుర
కాపీనారాయణి - దేశాది
పల్లవి:
సరస సామ దాన భేద దండ చతుర
సాటి దైవ మెవరె బ్రోవవే ॥స॥
అను పల్లవి:
పరమశాంభవాగ్రేసరుం డనుచు
బల్కు రావణుఁడు తెలియలేకపోయె ॥స॥
చరణము(లు):
హితవుమాట లెంతో బాగ బల్కితివి
సతముగా నయోధ్య నిచ్చే నంటివి
నతసహోదరుని రాజుఁ జేసి రాక
హతము జేసితివి త్యాగరాజ నుత ॥స॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - sarasa saama daana bheeda daMDa chatura ( telugu andhra )