కీర్తనలు త్యాగరాజు సరివారిలోన చౌక చాలదాయెనా
భిన్నషడ్జమమ్‌ - దేశాది
పల్లవి:
సరివారిలోన చౌక చాలదాయెనా స..
అను పల్లవి:
పొరుగిండ్లు వారలచేతి పూజ
చూచిచూచి చల్లనాయెనా స..
చరణము(లు):
తారుమారుగ బల్కు వారిలు
తత్తరించగ జూడ న్యాయమా
పారమార్థికుల దుఃఖజాలముల
బాపలేదా శ్రీత్యాగరాజనుత స..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - sarivaariloona chauka chaaladaayenaa ( telugu andhra )