కీర్తనలు త్యాగరాజు సార్వభౌమా, సాకేతరామ, మనసార బల్కరాద
రాగపంజరం - దేశాది
పల్లవి:
సార్వభౌమా, సాకేతరామ, మన
సార బల్కరాద? దేవతా ॥సార్వ॥
అను పల్లవి:
పార్వతీ రమణార్చిత పాద! రమా
పతి! వంద్య! పరాత్పర దీనబంధో! ॥సార్వ॥
చరణము(లు):
ముద్దు ముద్దుగ మాటలాడినది
ముందురాక సదా వెతజెందుచును
కద్దు కద్దనుచు చిరకాలమున
కరఁగు చుండవలెనా? త్యాగరాజనుత! ॥సార్వ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - saarvabhaumaa, saakeetaraama, manasaara balkaraada ( telugu andhra )