కీర్తనలు త్యాగరాజు సీతాకల్యాణ వైభోగమే
శంకరాభరణము - ఖండలఘువు
పల్లవి:
సీతాకల్యాణ వైభోగమే ॥సీ॥
అను పల్లవి:
పవనజస్తుతిపాత్ర పావనచరిత్ర
రవిసోమవరనేత్ర రమణీయగాత్ర ॥సీ॥
భక్తజనపరిపాల భరితశరజాల
భుక్తిముక్తిదలీల భూదేవపాల ॥సీ॥
పామరాసురభీమ పరిపూర్ణకామ
శ్యామ జగదభిరామ సాకేతధామ ॥సీ॥
సర్వలోకాధార సమరైకవీర
గర్వమానసదూర కనకాగధీర ॥సీ॥
నిగమాగమ విహార నిరుపమశరీర
నగధరాఘవిదూర నతలోకాధార ॥సీ॥
పరమేశ నుతగీత భవజలధిపోత
తరణికులసంజాత త్యాగరాజనుత ॥సీ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - siitaakalyaaNa vaibhoogamee ( telugu andhra )