కీర్తనలు త్యాగరాజు సీతాకల్యాణ వైభోగమే, రామ కల్యాణ వైభోగమే
శంకరాభరణం - ఖండలఘువు
పల్లవి:
సీతాకల్యాణ వైభోగమే
రామ కల్యాణ వైభోగమే ॥సీతా॥
అను పల్లవి:
పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర
రవి సోమ నవనేత్ర రమణీయ గాత్ర ॥సీతా॥
చరణము(లు):
భక్తజన పరిపాల భరిత శరజాల
భుక్తి ముక్తిద లీల భూదేవ పాల ॥సీతా॥
పామరా సురభీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభిరామ సాకేత ధామ ॥సీతా॥
సర్వలోకాధార సమరైక ధీర
గర్వమానసదూర కనకాగధీర ॥సీతా॥
నిగమాగమ విహార నిరుపమ శరీర
నగధ రాఘ విదార నత లోకాధార ॥సీతా॥
పరమేశనుత గీత భవజలధి పోత
తరణికుల సంజాత త్యాగరాజనుత ॥సీతా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - siitaakalyaaNa vaibhoogamee, raama kalyaaNa vaibhoogamee ( telugu andhra )