కీర్తనలు త్యాగరాజు సీతానాయక శ్రితజనపోషక శ్రీరఘుకులతిలక ఓ రామ
రీతిగౌళ - చాపు
పల్లవి:
సీతానాయక శ్రితజనపోషక శ్రీరఘుకులతిలక ఓ రామ ॥సీతా॥
చరణము(లు):
నిరుపేద భక్తుల కరితోత బడలేక గిరిపై నెక్కుకొంటివో ॥సీతా॥
అంగలార్పు జూచి రంగపురమున చె లంగుచు పండితివో ॥సీతా॥
గాచిన భక్తుల జూచి యాబలిని యాచించ వెడలితివో ॥సీతా॥
ఆశమించి నిన్నాశుజేరెద రని కీశుల జేరితివో ॥సీతా॥
జాలితోవచ్చు కుచేలుని కని గోపి చేలము లెత్తితివో ॥సీతా॥
ఇంగిత మెఱిఁగి యుప్పొంగుచు బ్రోచు బంగారు దొరవైతివో ॥సీతా॥
నీ గుణములు గుట్టు బాగుగ దెలిసెను త్యాగరాజ వినుత ॥సీతా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - siitaanaayaka shritajanapooShaka shriiraghukulatilaka oo raama ( telugu andhra )