కీర్తనలు త్యాగరాజు సుందరేశ్వరుని జూచి సురలఁ
శంకరాభరణ - ఆది
పల్లవి:
సుందరేశ్వరుని జూచి సురలఁ
జూడ మనసు వచ్చునా సుం..
అను పల్లవి:
అందముగల వరకాశికి సమానమైన గోపుర
మందు వెలయుమా సుం..
చరణము(లు):
చరణములను బంగారు నూపురములు
కరముల రవకంకణయుగములు శ్రీ
కరముఖమున కస్తూరి తిలకము
మెఱయుచునుండు లావణ్యముఁగల సుం..
ఒకచో బ్రహ్మాది సురలు
ఒకచో నిర్జరవారతరుణులు
ఒకచో తుంబురునారదాదులు
ఒకచో భక్తులెల్లఁ బాడు సుం..
రాజరాజునికి చెలికాఁడయిన
రాజశేఖరుని గోపురనిలయుని
రాజసగుణరహితుని శ్రీ త్యాగ
రాజపూజితుని రజతగిరీశుని సుం..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - suMdareeshvaruni juuchi surala.r ( telugu andhra )