కీర్తనలు త్యాగరాజు సుఖియెవరో రామనామ
కానడ - దేశాది
పల్లవి:
సుఖియెవరో రామనామ ॥సు॥
అను పల్లవి:
సుఖియెవరో సుముఖియెవరో
అఖిలసారమగు తారకనామ ॥సు॥
చరణము(లు):
సత్యము తప్పక సకల లోకులకు
భృత్యుఁడై దైవ భేదము లేక
నిత్యమైన సుస్వరగానముతో
నిరంతరము త్యాగరాజనుత నామ ॥సు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - sukhiyevaroo raamanaama ( telugu andhra )