కీర్తనలు త్యాగరాజు సుజన జీవన సుగుణభూషణ రామ
కమాస్‌ - రూపకము
పల్లవి:
సుజన జీవన సుగుణభూషణ రామ ॥సు॥
అను పల్లవి:
భుజగభూషణార్చిత బుధజనావనా
అజవందిత శ్రితచందన దశతురంగ మామవ ॥సు॥
చరణము(లు):
చారునేత్ర శ్రీకళత్ర శ్రీరమ్యగాత్ర
తారకనామ సుచరిత్ర దశరథపుత్ర
తారకాధిపానన ధర్మపాలక
తారయ రఘువర నిర్మల త్యాగరాజసన్నుత ॥సు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - sujana jiivana suguNabhuushhaNa raama ( telugu andhra )